ఏపీలోని టీడీపీ నేతలపై మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో దోపిడీ చేశారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలోనే స్కామ్ జరిగిందని ఆరోపించారు.
అవినీతికి పాల్పడటంతో చంద్రబాబు దిట్టని మంత్రి కాకాణి తెలిపారు.
చంద్రబాబును సమర్థిస్తున్న సోమిరెడ్డికి సిగ్గులేదని ధ్వజమెత్తారు.వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే లోకేశ్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.
చేసిన తప్పులకు చంద్రబాబుకు శిక్ష పడిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పడుతుందని వెల్లడించారు.







