న్యాయాధికారుల నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ గత కొంత కాలంగా న్యాయాధికారులు, న్యాయవాదులు, జ్యుడీషియల్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం ఉగ్రరూపం దాల్సిన నేపధ్యంలో శనివారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీజే టీఎస్ ఠాకూర్‌ను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి సీజే డీబీ బోస్లే కలుసుకున్నారు.హైకోర్టు విభజన కోరుతూ హైదరాబాద్‌లో న్యాయవాదుల ఆందోళనల కారణంగా ఉమ్మడి కోర్టు పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ఉభయులూ చర్చించినట్టు సమాచారం, న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులు, న్యాయవాదుల విధుల బహిష్కరణ, న్యాయశాఖ ఉద్యోగుల పెన్‌డౌన్‌తో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయిన విషయాలపై బోస్లే వివరించినట్టు సమాచారం.
న్యాయాధికారుల సస్పెన్షన్ల వ్యవహారం పైనా సుప్రీం సిజే ఆసక్తిగా ప్రశ్నించడంతో న్యాయ వ్యవస్ధపై గౌరవం పెంచేలా చర్యలు చేపట్టినట్టుగా హైకోర్టు సిజే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అత్యంత భధ్రత నడుమ ఏపీ స్థానికతకు చెందిన న్యాయాధికారులు కోర్టులకు హాజరవుతున్నప్పటికీ కేసుల విచారణలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని, సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వానికి తగిన సూచనలివ్వాలని కోరినట్టు వినవస్తోంది.
కాగా మరోవైపు హైదరాబాద్ ఇంది రాపార్కులో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలకు న్యాయాధికారులకు మద్దతుగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నాయి.తెలంగాణ జేఏసీతో సహా పలు రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటిస్తూ, దీక్షా శిబిరాన్ని సందర్శిస్తున్నాయి.
ఈ ్రకమంలో సుప్రీం ఎలాంటి చర్యలు తీసుకోనుందో సర్వ్రతా ఉత్కంఠ నెలకొంది.







