తిమ్మరుసుగా మే21న రావడానికి రెడీ అవుతున్న సత్యదేవ్

ఈ మధ్యకాలంలో హీరోగా సక్సెస్ అయ్యి వరుస సినిమాలతో మంచి కెరియర్ ట్రాక్ బిల్డ్ చేసుకుంటున్న నటులలో సత్యదేవ్ ముందు వరుసలో ఉన్నాడు.హీరో ఫ్రెండ్ పాత్రలతో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్స్ లో మెప్పించిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమాతో పూరీ జగన్నాథ్ కారణంగా హీరో అయిపోయాడు.

 Satyadev's Timmarusu Gets A Release Date, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

తరువాత బ్లఫ్ మాస్టర్ సినిమాతో తనలోని పూర్తి స్థాయి నటుడిని పరిచయం చేసిన విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్యః సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటుడుగా కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మెప్పించాడు.

మలయాళంలో ఫాజిద్ ఫైజల్ లాంటి టాలెంటెడ్ స్టార్ నటుడు పోషించిన పాత్రని తెలుగులో సత్యదేవ్ చేశాడు.అయితే పెర్ఫార్మెన్స్ విషయంలో అతనికి ఏ మాత్రం తగ్గకుండా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో మూడు సినిమాల వరకు ఉన్నాయి.వాటిలో బ్లఫ్ మాస్టర్ సీక్వెల్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.అదే సమయంలో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మాతగా తిమ్మరుసు అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో సత్యదేవ్ పవర్ ఫుల్ యంగ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు.

వ్యవస్థలో ఉన్న లూప్స్ అడ్డుపెట్టుకొని కొంత మంది ఎలా అక్రమాలు చేస్తున్నారు అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.మే 21న సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube