యువ హీరోల్లో ఎంతో టాలెంట్ ఉన్నా సరే లక్ కలిసి రాని వారిలో సత్యదేవ్( Satyadev ) ఒకరు.గాడ్ ఫాదర్ సినిమాలో చిరు కి విలన్ గా నటించినా ఆ తర్వాత కూడా అతని కెరీర్ ఆశించిన రేంజ్ లో ఏమి లేదు.
డిఫరెంట్ సినిమాలు చేస్తూ కొంతమేరకు ఆడియన్స్ ను మెప్పిస్తున్నా సత్యదేవ్ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.ఈ క్రమంలో సత్యదేవ్ లేటెస్ట్ గా ఫుల్ బాటిల్( Full Bottle ) అనే సినిమా చేశాడు.
ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశారు.ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది.
టీజర్ చూస్తే ఈసారి సత్యదేవ్ ఊర మాస్ అటెంప్ట్ చేశాడని తెలుస్తుంది.ఇన్నాళ్లు వెరైటీ కథలతో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన సత్యదేవ్ ఈసారి మాస్ ఆడియన్స్ ని మెప్పించాలని ఫుల్ బాటిల్ చేసినట్టు అనిపిస్తుంది.
సత్యదేవ్ ఫుల్ బాటిల్ టీజర్ ఇంప్రెస్ చేసింది.మరి టీజర్ లానే సినిమా కూడా ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.సత్యదేవ్ కి ఇదైనా హిట్ పడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాలో సత్యదేవ్ సరసన సంజన ఆనంద్( Sanjana Anand ) హీరోయిన్ గా నటించింది.