తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇంతకుముందు తెలుగులో పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగచిక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే హీరో సత్యదేవ్ కన్నడ స్టార్ డాలీ ధనుంజయతో కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు.
ఈ సినిమాను ఓల్డ్ టౌన్ పిక్చర్ బ్యానర్లపై బాల సుందరం దినేష్ సుందరం కలిసి నిర్మిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా క్రిమినల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందీ.కాగా ఈ సినిమా ఇద్దరు ప్రధాన పాత్రలకు సంబంధించిన 26వ ప్రాజెక్ట్.ఇకపోతే ఇందులో తమిళ నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.ఈ సినిమాతో తమిళ బ్యూటీ ప్రియా భవాని శంకర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన తిరు అనే సినిమాలో నటించింది.

సత్యదేవ్ నటిస్తున్న సినిమాతో స్ట్రైట్ గా తెలుగు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది భవాని శంకర్.ఇకపోతే ఇందులో ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్ గా కనిపించనుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో నటులు సత్యదేవ్, ధనుంజయలు ఒకే ప్రేమ్ లో కనిపించబోతున్నారు.ఇకపోతే ఇటీవలే మెగాస్టార్ సినిమాలో విలన్ గా నటించి సంఘటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ గాడ్ ఫాదర్ సినిమా తరువాత ద్విభాష సినిమాకు ప్లాన్ చేయడం అన్నది సరైన నిర్ణయం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.







