తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల తరువాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఇంకా బీసీ రిజర్వేషన్లు ఖరారు కాలేదు.కేటగిరీల వారీగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.అలాగే జనవరి 31 తో సర్పంచ్ ల పదవీకాలం కూడా ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
సర్పంచ్ ల పదవీ కాలం ముగియడానికి ఇంకా 36 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







