పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ”సలార్” డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).ప్రభాస్ నుండి ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత మరో సినిమా రావడం అది కూడా ఎట్టకేలకు డార్లింగ్ కు హిట్ ఇవ్వడం ఫ్యాన్స్ కు అమితానందం ఇస్తుంది.ఈ సినిమాతో ఎన్నో ఏళ్ల అభిమానుల కల నెరవేరింది.పాన్ ఇండియా స్టార్ అయినా తమ హీరో రేంజ్ కు తగ్గ సినిమా రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా అన్ని కోరికలను నెరవేర్చి మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకునేలా చేసింది.క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చి ఈ సెలవులను క్యాష్ చేసుకునే పనిలో ఉంది.ఇక ఈ సినిమా మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పై తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ను రివీల్ చేసారు.

డార్లింగ్ సలార్ సినిమాతో మూడు రోజుల్లోనే 402 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం.ఇదే విషయాన్నీ కొత్త పోస్టర్ తో కన్ఫర్మ్ చేసారు.మరి లాంగ్ రన్ లో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో మరికొద్ది రోజులు వేచి చుస్తే అసలు విషయం బయట పడనుంది.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.
అలాగే రవి బసృర్ సంగీతం అందించారు.







