ఏపీ పారిశ్రామిక రంగంపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ..: సీఎం జగన్

ఏపీలో పలు కొత్త పరిశ్రమలు కొలువుదీరాయి.ఈ మేరకు కొత్త పరిశ్రమలను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

 Sarkar's Special Attention On Ap Industrial Sector..: Cm Jagan-TeluguStop.com

రూ.1,072 కోట్లతో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు కాగా ఈ పరిశ్రమలతో సుమారు 21,079 మందికి ఉపాధి దొరకనుంది.పరిశ్రమల ప్రారంభోత్సవం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని తెలిపారు.కలెక్టర్లు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని చెప్పారు.

పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆ దిశగా అడుగులు వేయాలని తెలిపారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 386 ఎంవోయూలు చేసుకున్నామన్నారు.రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నామన్న సీఎం జగన్ ఆరు లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube