82 కాదు 92 అయినా తగ్గేదే లే ?

తన వయసు పై కామెంట్ చేసిన తిరుగుబాటు ఎంఎల్ఏ అజిత్ పవార్( MLA Ajit Pawar ) తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు శరద్ పవార్( Sharad Pawar ) తనకి 82 సంవత్సరాలు కాదు 92 సంవత్సరాలు వచ్చిన తన సమర్ధత తగ్గదని తాను అప్పటికి కూడా ఇలాగే పోరాటం చేస్తానని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.ఎన్సిపి లో జరిగిన పరిణామాలపై చర్చించడానికి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఢిల్లీలో( Delhi ) ఏర్పాటు చేసిన శరద్ పవా ర్ ఈ సమావేశం తర్వాత తమ సభ్యుల నైతిక మద్దతు మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.

 Saradpawar Response On Ajit Words , Mla Ajit Pawar, Delhi, Sharad Pawar, Rahul-TeluguStop.com

ఎన్సిపి గుర్తు పై చెప్పాల్సిందేదో ఈసీకే చెబుతామని తమది న్యాయమైన పోరాటమని , విజయం తమదే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Telugu Delhi, Mla Ajit Pawar, Rahul Gandhi, Sharad Pawar-Telugu Political News

ఇదిలా ఉండగా ఆయనను కలిసి నైతిక మద్దతు ఇవ్వడానికి రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి వెళ్లారు జరిగిన పరిణామాలపై చర్చించి ఆయనకు నైతిక మద్దతును తెలియజేశారు.మరోవైపు అజిత్ పవార్ వర్గం కూడా ఈసీకి వినతిపత్రం ఇ చ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.మెజారిటీ మ్మెల్యేలు మద్దతు తనకే ఉంది కాబట్టి ఎన్సిపి గుర్తును తనకే కేటాయించాలని ఆయన ఈసిని కోరినట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా మెజారిటీ సభ్యులు మద్దతు తనవైపు ఉండగా జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసే కు శరద్ పవర్ కి లేదని తిరుగుబాటుకు ముందే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించి నందున ఏ హోదాలో ఆయన సమావేశం నిర్వహించారని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది .

Telugu Delhi, Mla Ajit Pawar, Rahul Gandhi, Sharad Pawar-Telugu Political News

మరో రెండు రోజుల్లో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అజిత్ పవార్ వర్గానికి కేంద్ర క్యాబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కవచ్చు అని వార్తలు వస్తున్నాయి.ఈయన వర్గం నుంచి ప్రపుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది .ఆయనకు కేబినెట్ ర్యాంకు దక్కుతుందని అంచనాలు ఉండగా మరో ఇద్దరు నేతలకు కూడా కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ట చివరి దశలో వచ్చిన ఈ సంక్షోభాన్ని రాజకీయ కురువృద్ధుడు శరద్ పవర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube