Sapta Sagaralu Dhaati : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సప్త సాగరాలు దాటి.. ఈతరం ప్రేక్షకులకు ఈ మూవీ బెస్ట్ అంటూ?

సినిమా కథలు కంటెంట్ ఉంటే ఎలాంటి భాషా చిత్రాలైన తెలుగు ప్రేక్షకులు ఎంతో మంచిగా ఆదరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.ఇప్పటికే తమిళ కన్నడ భాషలలో విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశారు.

 Saptha Sagaralu Dhati Film Streaming On Amazon Prime-TeluguStop.com

ఆ సినిమాలకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభించిందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రక్షిత్ శెట్టి ( Rakshith Shetty ) నటించిన కన్నడ సినిమాని తెలుగులో సప్తసాగరాలు దాటి ( Saptha Saagaralu Dhaati ) అనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.


Telugu Amazon Prime, Rakshith Shetty, Rukmini Vasanth, Saptasagaralu, Tollywood-

ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికీ థియేటర్ సమస్య రావడం చేత వెంటనే ఈ సినిమాని ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఓటీటీలో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video )లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.ఇలా ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకుండా ఈ సినిమాని ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడంతో ఒక్కసారిగా అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 22వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కొన్ని థియేటర్ సమస్యలు వచ్చాయి దీంతో ఓటీటీలో విడుదల చేశారు.

అయితే ఈ సినిమాకు ఇక్కడ ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.


Telugu Amazon Prime, Rakshith Shetty, Rukmini Vasanth, Saptasagaralu, Tollywood-

సప్త సాగరాలు దాటిన ఈ ప్రేమ కథ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ( Saptha Saagaralu Dhaati Review ) ఇస్తున్నారు.ప్రేమలో పడిన ఒక జంట ప్రయాణమే ఈ సినిమా కథ అయితే ఈ ప్రయాణంలో విధివారికి ఏ విధమైనటువంటి ఆటంకాలను కలిగించింది ఆ ఆటంకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా థియేటర్లలో ఈ సినిమాని చూడలేకపోయాము అనుకున్న వారు ఈ సినిమాని ప్రస్తుతం అమెజాన్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇక ఈ సినిమా కన్నడలో సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ ఈ సినిమాని తెలుగులో సప్త సాగరాలు దాటే అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube