సూపర్‌ హిట్ మూవీ సీక్వెల్‌ ని పట్టించుకోని టాలీవుడ్‌..!

సెప్టెంబర్‌ 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్ ఎ( Sapta Sagaralu Dhaati Side A ) కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.కర్ణాటకలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగులో రెండు వారాల వ్యవధి లోనే విడుదల చేయడం జరిగింది.

 Sapta Sagaralu Dhaati Side B Telugu Dubbing Release ,sapta Sagaralu Dhaati Side-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల ఆశించిన స్థాయి లో వసూళ్లు నమోదు అవ్వలేదు.

అంతే కాకుండా హడావుడిగా విడుదల చేయడం ద్వారా ఎక్కువగా వసూళ్లు నమోదు అవ్వలేదు.అయితే ఆ సినిమా లోనే రెండో పార్ట్‌ ఉండబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Kannada, Kollywood, Rakshith Shetty, Saptasagaralu, Tollywood-Movie

అన్నట్లుగానే రెండో పార్ట్‌ ను వచ్చే వారంలో విడుదల చేయబోతున్నారు.అంటే నవంబర్ 17న విడుదల అవ్వబోతున్న సప్తసాగరాలు దాటి సైడ్‌ బి సినిమా కు కన్నడ నాట భారీ క్రేజ్ ఉంది.కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.మొదటి భాగం కు పెద్దగా ప్రచారం చేయలేదు.కానీ ఈ సినిమాకు మాత్రం మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు.కానీ ఈ సినిమా ను జనాలు పట్టించుకోవడం లేదు.

పెద్దగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.

Telugu Kannada, Kollywood, Rakshith Shetty, Saptasagaralu, Tollywood-Movie

మొత్తానికి సూపర్ హిట్‌ మూవీ కి సీక్వెల్‌ విడుదల అవ్వబోతున్నా కూడా జనాలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమా లో రక్షిత్‌ శెట్టి( Rakshit Shetty )B హీరోగా నటించాడు.తెలుగు లో ఆయన గత చిత్రాలు అతడే శ్రీమన్నారాయణ, 777చార్టీ, సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ విజయాలను సొంతం చేసుకున్నాయి.

కానీ ఈ సినిమాకు మాత్రం పెద్దగా బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు.కనీసం విడుదల అయిన తర్వాత అయినా బజ్ క్రియేట్‌ అయ్యేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube