సూపర్‌ హిట్ మూవీ సీక్వెల్‌ ని పట్టించుకోని టాలీవుడ్‌..!

సెప్టెంబర్‌ 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్ ఎ( Sapta Sagaralu Dhaati Side A ) కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

కర్ణాటకలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగులో రెండు వారాల వ్యవధి లోనే విడుదల చేయడం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల ఆశించిన స్థాయి లో వసూళ్లు నమోదు అవ్వలేదు.

అంతే కాకుండా హడావుడిగా విడుదల చేయడం ద్వారా ఎక్కువగా వసూళ్లు నమోదు అవ్వలేదు.

అయితే ఆ సినిమా లోనే రెండో పార్ట్‌ ఉండబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

"""/"/ అన్నట్లుగానే రెండో పార్ట్‌ ను వచ్చే వారంలో విడుదల చేయబోతున్నారు.

అంటే నవంబర్ 17న విడుదల అవ్వబోతున్న సప్తసాగరాలు దాటి సైడ్‌ బి సినిమా కు కన్నడ నాట భారీ క్రేజ్ ఉంది.

కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

మొదటి భాగం కు పెద్దగా ప్రచారం చేయలేదు.కానీ ఈ సినిమాకు మాత్రం మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు.

కానీ ఈ సినిమా ను జనాలు పట్టించుకోవడం లేదు.పెద్దగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.

"""/"/ మొత్తానికి సూపర్ హిట్‌ మూవీ కి సీక్వెల్‌ విడుదల అవ్వబోతున్నా కూడా జనాలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా లో రక్షిత్‌ శెట్టి( Rakshit Shetty )B హీరోగా నటించాడు.

తెలుగు లో ఆయన గత చిత్రాలు అతడే శ్రీమన్నారాయణ, 777చార్టీ, సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ విజయాలను సొంతం చేసుకున్నాయి.

కానీ ఈ సినిమాకు మాత్రం పెద్దగా బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు.కనీసం విడుదల అయిన తర్వాత అయినా బజ్ క్రియేట్‌ అయ్యేనా చూడాలి.

టాలీవుడ్ స్టార్ హీరోలు పైరసీకి వ్యతిరేకంగా పోరాడలేరా.. అలా చేయడం సాధ్యం కాదా?