తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలయ్య బాబు నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను అందుకొని దూసుకుపోతున్నాయి.
అయితే మెగాస్టార్, బాలయ్య బాబు నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి సందడి చేయబోతున్నాయి అనగానే చాలావరకు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలో వెనక్కి అడిగేసిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొనడంతో చాలా వరకు చిన్న చిన్న సినిమాలు వెనకడుగు వేసాయి.
కొన్ని సినిమాలు విడుదల అవ్వాలి అని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆఖరి నిమిషంలో కూడా కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి.అయితే బాలయ్య బాబు చిరంజీవి సినిమాలు విడుదల అవుతున్నాయి అని తెలిసినా కూడా ధైర్యం చేసి విజయ నటించిన వారసుడు సినిమాను విడుదల చేశాడు నిర్మాత దిల్ రాజు.
ఈ సినిమా కాస్త కూస్తో పరవాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ రాబట్టింది.

అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో పాటు మరో చిన్న సినిమా కూడా విడుదల అయింది.అదే కళ్యాణం కమనీయం.హీరో శోభన్ బాబు నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ బాగానే జరిగాయి.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిన్న సినిమా కోసం ప్రభాస్ కూడా హెల్ప్ చేసిన విషయం తెలిసిందే.

బాలయ్య బాబు చిరంజీవి సినిమాల ప్రభంజనంలో కళ్యాణం కమనీయం సినిమా ఎప్పుడు విడుదల అయింది అన్న విషయం కూడా చాలామందికి తెలియలేదు.ఈ చిన్న సినిమా ప్రమోషన్స్ ఎంత బాగా చేసినప్పటికీ, అలాగే పాన్ ఇండియా చేస్తారు ప్రభాస్ హెల్ప్ చేసినప్పటికీ కళ్యాణం కమనీయం సినిమా వైపు చాలామంది ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడలేదు.సంక్రాంతికి ఒక వారం ముందు లేదా వారం తర్వాత విడుదల చేసి ఉంటే ప్రేక్షకులు సినిమాను చూసేవారు అలాగే కలెక్షన్స్ కూడా బాగా వచ్చేవి.
కానీ పెద్ద సినిమాలతో పాటు విడుదల చేయడంతో ఈ సినిమా విడుదలైన విషయాన్నీ మర్చిపోయారు.దీంతో పండగ టార్గెట్లో ఇద్దరు పెద్ద హీరోల మధ్య సంతోష్ శోభన్ ఇరుక్కుపోయి గిల గిల కొట్టుకున్నంత పని అయ్యింది.







