సంక్రాంతి పండుగ కానుకగా 5 సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా ఈ 5 సినిమల థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.అయితే ఈ 5 సినిమాలలో ఒక్కో సినిమా టార్గెట్ ఒక్కో విధంగా ఉంది.
సంక్రాంతి సినిమాలైన వారిసు, తునివు ఈరోజు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.వారిసు తెలుగు వెర్షన్ వారసుడు మూవీ ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
వారిసు మూవీకి విజయ్ ఏకంగా 105 కోట్ల రూపాయలు + జీఎస్టీ పారితోషికంగా తీసుకున్నారని సమాచారం.ఈ సినిమాతో విజయ్ కు ఏకంగా 135 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు 140 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని బోగట్టా.ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
తునివు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అన్ని భాషల థియేట్రికల్ హక్కులు 90 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది.సంక్రాంతికి విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు కూడా రికార్డ్ స్థాయిలోనే బిజినెస్ జరిగింది.రవితేజ హీరోగా నటించడం వాల్తేరు వీరయ్య మూవీకి ఒకింత ప్లస్ అయింది.
వీరసింహారెడ్డి సినిమాకు 72 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరగగా వాల్తేరు వీరయ్య సినిమాకు 85 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ జరిగింది.కళ్యాణం కమనీయం సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలవుతుండగా ఈ సినిమాకు శాటిలైట్, డిజిటల్ హక్కులతోనే భారీ మొత్తంలో ఆదాయం చేకూరిందని సమాచారం.సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.క్షణాల్లోనే ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం.సంక్రాంతి సినిమాలు భారీగా కలెక్షన్లు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.