కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా విప్పుతా : బండి సంజయ్

త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )అక్రమాస్తుల చిట్టా విప్పుతానంటూ కరీంనగర్ బిజెపి ఎంపీ,  తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ అక్రమ ఆస్తుల కు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నా యని సంజయ్ అన్నారు.

వాటిపై కచ్చితంగా విచారణ జరుగుతామని, వాటికి సంబంధించిన వివరాలు బయట పెడతానని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇంకా అనేక అంశాలపై మీడియా సమావేశంలో ఈరోజు సంజయ్ మాట్లాడారు.

  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలు పై బండి సంజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన బిజెపికి( BJP ) లేదని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటూ కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో( Vemulavada ) మాట్లాడిన కేటీఆర్ జూన్ 2 వరకే హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని , ఆ తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం బిజెపి చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దీనిపైన బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయకుండా ఆప గలిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించడం పైన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో బిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది .తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బిజెపి , బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా నే ప్రయత్నాలు చేస్తున్నా యి.ఈ క్రమంలోనే మూడు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరి ప్రభావాన్ని మరొకరు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు