భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) కొత్తగూడెంలో బీజేపీ బహిరంగ సభ జరిగింది.ఈ సభకు హాజరైన ఆ పార్టీ అగ్రనేత జేపీ నడ్డా( JP Nadda ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశం బాగుండాలని కోరుకునే పార్టీ బీజేపీ( BJP ) అని జేపీ నడ్డా తెలిపారు.నరేంద్ర మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామన్నారు.
జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ తొలగించామన్న ఆయన గిరిజనుల కోసం మోదీ ప్రభుత్వం( Modi Government ) పని చేస్తుందని తెలిపారు.అభివృద్ధి మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.