మళ్లీ తండ్రయిన అర్జున్ రెడ్డి క్రియేటర్

అర్జున్ రెడ్డి వంటి కల్ట్ క్లాసిక్ మూవీతో టాలీవుడ్‌ను షేక్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్టర్‌ను క్రియేట్ చేసి తన సత్తా చాటుకున్నాడు ఈ డైరెక్టర్.

 Sandeep Reddy Vanga Becomes Father For Second Time-TeluguStop.com

ఇక అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా విజయంతో సందీప్ రెడ్డి వంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేగాక బాలీవుడ్‌లోనూ అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.ఈ సక్సె్స్‌ను ఎంజాయ్ చేస్తున్న సందీప్ రెడ్డికి వ్యక్తిగత జీవితంలోనూ మరో సంతోషకరమైన ఘటన చోటు చేసుకుంది.

ఆయన భార్య మనీషా రెడ్డి గురువారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.దీంతో సందీప్ రెడ్డి కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఓ బాబు ఉన్న సందీప్ రెడ్డి దంపతులు, ఈ పాప పుట్టడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇక కబీర్ సింగ్ తరువాత సందీప్ రెడ్డి తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.మరి అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఎవరితో తన నెక్ట్స్ మూవీని చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube