తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో సందీప్ కిషన్ పలు సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.
అయితే సందీప్ కిషన్ నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయే తప్ప బ్లాక్ బస్టర్ హిట్టు కాకపోవడంతో ఈ హీరోకు సరైన గుర్తింపు దక్కలేదు.సందీప్ కిషన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది.
ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ సందీప్ కిషన్ రేంజ్ ని పెంచే సినిమాలు మాత్రం రావడం లేదు.
అయితే వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను డిఫరెంట్ ప్రయోగాలను చేయాలని అనుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే అనుకున్న విధంగా మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాలో నటించాడు సందీప్.కాగా హీరో సందీప్ తాజాగా నటించిన పాన్ ఇండియా సినిమా మైఖేల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇందులో విజయ్ సేతుపతి కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కానుంది.సినిమా విడుదలకు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.పాన్ ఇండియా సినిమాను కూడా వివిధ భాషల్లో స్ట్రైట్ మూవీ అని చెప్పినా కూడా బేధాలు చూపిస్తారు.తమిళంలో అయితే ఇంకా డబ్బింగ్ అనే ముద్ర మారలేదు.కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఆ విషయంలో పెద్దగా అనుమానాలు పెట్టుకోకుండా సినిమాను చూస్తారు.ఎంత ట్రై చేసినప్పటికీ ఈ డిఫరెన్స్ అనేది ఎవరు మార్చలేకపోతున్నారు అని సందీప్ కిషన్ తెలిపాడు.

అనంతరం తన సినిమా గురించి మాట్లాడుతూ.మైఖేల్ సినిమా మాత్రం తప్పకుండా ఒక జెన్యూన్ అటెంప్ట్ అని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందనీ,బడ్జెట్ విషయంలో అలాగే కంటెంట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందించినట్లుగా తెలిపాడు సందీప్ కిషన్.ప్రేక్షకుల సమయం ఎంతో విలువైనది.
మైఖేల్ సినిమాను చూసినప్పుడు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు అని సందీప్ కిషన్ ధీమా వ్యక్తం చేశాడు.మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే ఫిబ్రవరి మూడవ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి.