ఎవరైనా ఏదైనా ప్రయత్నంలో విఫలమైతే డీలా పడిపోయి ఆ ప్రయత్నాలను విరమించుకుంటారు.కొందరు మరికొన్ని సార్లు ప్రయత్నించి చేతులెత్తేస్తారు.
అయితే ఓ వ్యక్తి మాత్రం తాను సాధించాలనుకున్న దాని కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించాడు.చివరికి అనుకున్నది సాధించి ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచాడు.
తన “డ్రీమ్ కంపెనీ” గూగుల్ సంస్థలో జాబ్ కోసం అతడు 39 సార్లు తిరస్కరించబడ్డాడు.అయితేనేం ఇప్పుడు తన 40వ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.
దీంతో జాబ్ సాధించిన తర్వాత సంబరాలు చేసుకుంటున్నాడు.ఈ విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
టైలర్ కోహెన్ అనే వ్యక్తికి గూగుల్ సంస్థల పని చేయాలనే కోరిక బలంగా ఉంది.
అయితే చాలా సార్లు ఇంటర్వ్యూలకు వెళ్లడం, రిజెక్ట్ కావడం పరిపాటిగా మారింది.అయితే ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా గూగుల్ సంస్థలో పని చేయాలనే తన కోరిక చావలేదు.
తాను గూగుల్‌లో దరఖాస్తు చేస్తూనే ఉన్నప్పుడు పట్టుదలతో ఉన్నాడు.ఇలా అతడు 39 సార్లు గూగుల్ సంస్థలో రిజెక్ట్ అయ్యాడు.
గూగుల్ సంస్థలో వెళ్లిన ఇంటర్వ్యూలు, దానికి రిజెక్ట్ అయిన సందర్భాలను అతడు తన కమ్యూనికేషన్ హిస్టరీ స్క్రీన్‌షాట్‌ను లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశాడు.

2019 నాటి ఇమెయిల్‌లు అందులో కనిపించాయి.”పట్టుదల మరియు పిచ్చితనం మధ్య చక్కటి గీత ఉంది.నా దగ్గర ఏది ఉందో తెలుసుకోవడానికి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను” అని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కోహెన్ రాశాడు.
అతను గూగుల్‌లో చేరడానికి డోర్‌డాష్‌లోని అసోసియేట్ మేనేజర్ – స్ట్రాటజీ ఆప్స్‌గా తన పాత్రకు రాజీనామా చేశాడు.ఏదేమైనా ఇలా 40 సార్లు ఒకే ఉద్యోగం కోసం అతడు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.