శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్ కు తర్వాతి తరం వెర్షన్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 ( Samsung Galaxy Watch 7 ) సిరీస్ త్వరలోనే భారత మార్కెట్లో మైమరిపించే అద్భుతమైన ఫీచర్లతో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది.ఈ వాచ్ స్పెసిఫికేషను వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్: ఈ వాచ్ 7 సిరీస్ మూడు వెర్షన్లలో అందుబాటులోకి రానుంది.ఈ మూడు వెర్షన్ కూడా వైఫై, eSIM లతో వచ్చే అవకాశం ఉంది.
శామ్ మొబైల్స్ రిపోర్టు ఆధారంగా గెలాక్సీ వాచ్ 7 సిరీస్ తొలి వేరియంట్ SM-L300, SM-L305 నంబర్లను కలిగి ఉంటుంది.రెండో వేరియంట్ SM-L310,SM-L315 నంబర్లను కలిగి ఉంటుంది.
మూడో వేరియంట్ SM-L700, SM-L705 నెంబర్లను కలిగి ఉంటుంది.
ఈ మోడల్ నెంబర్లలో చివరి అంకె 5 ఉన్న వేరియంట్ eSIM సపోర్ట్ సహా సెల్యూలర్ కనెక్టివిటీని( Cellular Connectivity ) కలిగి ఉంటుంది.వాచ్ 7సిరీస్ 32GB అంతర్గత స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.ఈ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ 3nm చిప్ పైన పని చేస్తుంది.
Wear OS,one UI వాచ్ పైన పని చేస్తుంది.గెలాక్సీ వాచ్ 6 సిరీస్ బేస్ బ్లూటూత్ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది.క్లాసిస్ వేరియంట్ ధర రూ.36999 గా ఉంది.
గెలాక్సీ వాచ్ 7 సీరీస్ ధర వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు.శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6, గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే సమయంలోనే గెలాక్సీ వాచ్ 7 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఇక మిగతా కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్లు ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంటాయో అన్ని ఫీచర్లను కూడా ఈ వాచ్ కలిగి ఉండనుంది.