సాధారణంగా ఒక కథతో వచ్చిన సినిమా హిట్ అయితే దానిని ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు.అఫీషియల్ ప్రేమే కానీ వాటిని డైరెక్ట్గా ప్రకటిస్తారు.
కానీ ఒకే స్టోరీ పట్టుకొని డిఫరెంట్ సినిమాలు చేయడం, అన్ని సినిమాలతో హిట్స్ అందుకోవడం అరుదని చెప్పుకోవచ్చు.అలాంటి కథలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువగానే ఉన్నాయని అనుకోవచ్చు.
అలాంటి కథల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం పదండి.ఆ కథ తెలుగులో నాలుగు, తమిళంలో ఒకటి, హిందీ భాషలో రెండు సినిమాలకు మెయిన్ స్టోరీ అయ్యింది.
ఈ సినిమాల్లో ఒకదానికొకటి ఏదీ రీమేక్ కాదు.అన్ని సినిమాలకు ఆయువు పట్టు అయిన ఆ కథను ప్రముఖ సినిమా దర్శకుడు, రచయిత కె.భాగ్యరాజా రాశారు.అది ఆయన రాసిన సొంత కథేం కాదు.
ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు బి.పుట్టస్వామయ్య అర్థాంగి అనే కన్నడ నవల రాయగా దానినే సినిమాలకు తగ్గట్లు కె.భాగ్యరాజ్ రాశారు.

అలా రాసిన కథతో మొదటగా ‘ఎంగ చిన్న రస’ అనే తమిళ మూవీ వచ్చింది.దీనికి కె.భాగ్యరాజా దర్శకత్వం వహించాడు.భాగ్యరాజా, రాధ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.దీన్ని ‘చిన్నరాజా’ టైటిల్‌తో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.
కొద్ది రోజుల తర్వాత ఈ స్టోరీని తీసుకుని హిందీలో అనిల్‌కపూర్, మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా పెట్టి ‘బేటా( Beta ) పేరుతో ఓ మూవీ తీయగా అది కూడా హిట్ అయ్యింది.‘బేటా’ మూవీ రైట్స్‌ను ఇ.వి.వి సత్యనారాయణ కొనుగోలు చేసి అబ్బాయిగారు( Abbaigaru ) టైటిల్‌తో ఓ సినిమా తీయగా అది కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అబ్బాయిగారు మూవీలో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు.

నిజానికి అప్పటికే చిన్న రాజా మూవీ( Chinna Raja ) తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది.అదే కథతో అబ్బాయిగారి సినిమా వచ్చినా సరే ప్రేక్షకులు దానిని మళ్లీ చూసి హిట్ చేశారు.చివరికి కన్నడ డైరెక్టర్ డి రాజేంద్ర బాబు “అన్నయ్య” పేరుతో ఇదే కథను ఉపయోగించుకుంటూ ఒక సినిమా తీసి విజయం సాధించారు.ఇలా ఒకే కథతో విభిన్న భాషల్లో సినిమాలు రూపొందుతూ హిట్స్ సాధించి ఆశ్చర్యపరిచాయి.”ప్రేమలు పెళ్లిళ్లు” మూవీ కథ కూడా చాలా ఇతర సినిమాలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి వివిధ భాషా ప్రేక్షకులను ఆకట్టుకుంది.





 

