టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన మనుషులు మూఢనమ్మకాలు నుండి బయటకు రాలేక పోతున్నారని తాజాగా ఘటనలు బట్టి చెప్పవచ్చు.పెద్దపెద్ద ఉన్నత చదువులు చదివిన గాని కొంతమంది భగవంతుడు భక్తి పేరుతో సొంత బిడ్డలను పొట్టన పెట్టుకోవటం చాలామందిని విస్మయానికి గురి చేస్తోంది.
ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లిలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత చదువులు చదివిన గాని ఇద్దరు ఆడబిడ్డలను శివుడు పేరిట చంపేయడం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.సరిగ్గా ఇదే తరహాలో కేరళ రాష్ట్రంలో ఓ తల్లి సొంత కొడుకుని చంపేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలోని పాలక్కాడ్ లో సులేమాన్, షాహీన్ అనే దంపతులు నివసిస్తున్నారు.సులేమాన్ టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.షాహీన్ ఇంటికి సమీపంలో ఉన్న ఒక పాఠశాలలో టీచర్గా పని చేస్తోంది.వీళ్ళకి ముగ్గురు సంతానం ప్రస్తుతం షాహీన్ మరలా గర్భవతిగా ఉంది.
ఇటువంటి తరుణంలో ఆమె పాఠశాలలకు వెళ్ళకుండా ఇంటికాడ ఇతర పిల్లలతో ఉంది.అయితే ఇద్దరు పిల్లలు తండ్రి సులేమాన్ వద్ద పండుకో గా. చిన్నవాడైనా ఆదిల్ తో ఇటీవల ఇంటిలో ఒక రూము లో శనివారం షాహిన్ పడుకోవడం జరిగింది.కాగా సరిగ్గా ఆదివారం తెల్లారుతుంది అనగా చిన్నవాడైన ఆదిల్ ని నిద్రలేపి బాత్ రూం లోకి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతుకోసి చంపేసింది.
ఆ తర్వాత కాసేపటికి తెలివి లోకి తేరుకుని స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి తానే హత్య చేసినట్లు ఒప్పుకొంది.ఈ క్రమంలో అల్లాహ్ తన కొడుకుని బలి ఇవ్వమన్నాడు అని పోలీసులకు తెలిపింది.
దీంతో వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన ఇప్పుడు కేరళ రాష్ట్రం లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.