ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’

యశోద కళ్లు తెరిచి చూసింది.రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం.

 ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ త�-TeluguStop.com

చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోదకు చాలా కొత్త కొత్త గాను, వింత వింత గానూ అనిపిస్తున్నాయి.తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది.

తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది.కానీ, అక్కడేం జరిగింది? ఇదంతా ‘యశోద’ ఫస్ట్ గ్లిoప్స్ లో కనిపిస్తుంది.దీన్ని బట్టే ‘యశోద’ సినిమా ఎంత వైవిద్యంగా ఉంటుందో ఊహించుకోవచ్చునంటున్నారు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం ‘యశోద’.జంట దర్శకులు హరి-హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ గ్లిoప్స్ ను ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ-‘’ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో సమంత కు పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు వచ్చింది.దాన్ని దృష్టి లో పెట్టుకుని ఆమె స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నాం.

దానికి తగ్గట్టుగానే సమంత ‘యశోద’ పాత్ర విషయంలో కనబరిచిన డెడికేషన్, పాత్రను సొంతం చేసుకున్న తీరు ఎక్సలెంట్.సమంత నటన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది.

ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తైయింది.ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఆఖరి షెడ్యులు చేస్తున్నాం.

Telugu Directorshari, Murali Sharma, Samantha, Yashoda, Yashoda Glimpse-Movie

జూన్ మొదటి వారానికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.ఏప్రిల్ లో కోడైకెనాల్ లో క్లైమాక్స్ తీశాం.ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యం లో ప్రదాన తారాగణం పై ఈ క్లైమాక్స్ చిత్రీకరించాం.ఈ సినిమాలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కి కూడా చాలా ప్రాధాన్యం ఉంది.

జంట దర్శకులు హరి-హరీష్ సినిమాని తీర్చి దిద్దుతున్న తీరు ఇంప్రెసివ్ గా ఉంది.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.

Telugu Directorshari, Murali Sharma, Samantha, Yashoda, Yashoda Glimpse-Movie

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా.చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, కెమెరా: ఎం.సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube