ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత.( Samantha ) ఈమెకి ఇండస్ట్రీ లో అక్క కానీ, చెల్లి కానీ లేదు అని ఇన్ని రోజులు అనుకుంటూ వచ్చాము.
కానీ ఆమెకి ఒక చెల్లెలు ఉందని సోషల్ మీడియా లో ఈమధ్య బాగా ప్రచారం అవుతుంది.అంతే కాదు ఆమె చెల్లి లేటెస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిందట, టాలీవుడ్ టాప్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తారట.
ఆమె మరెవరో కాదు సంయుక్తా మీనన్( Samyuktha Menon ).పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ద్వారా ఈమె తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.ఈ సినిమా తర్వాత ఆమె ‘సార్’ , ‘భింబిసారా’ మరియు ‘విరూపాక్ష‘( Virupaksha movie ) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ‘డెవిల్’ ( Devil )అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది.

అయితే సమంత కి సంయుక్త మీనన్ చెల్లెలు అవ్వడం ఏమిటి.?, అది ఎలా సాధ్యం అవుతుంది అని మీరంతా అనుకోవచ్చు.కానీ నిజానికి వీళ్లిద్దరు రక్తం పంచుకొని పుట్టిన అక్కా చెల్లులు కాదు, కనీసం వీళ్లిద్దరు ఒక్కసారి కలుసుకోలేదు కూడా.అయిన కూడా ఇలాంటి వార్త ఎలా ప్రచారం అయ్యింది అని మీరంతా అనుకోవచ్చు.
కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సంయుక్త మీనన్ ఈ విషయం చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ ‘నా ఫేస్ కట్ , సమంత గారి ఫేస్ కట్ కి దగ్గర ఉంటుందట.
ఆమె కళ్ళు, ముక్కు దాదాపుగా నాతో పోలి ఉంటుందని చాలా మంది చెప్పారు.కొంతమంది అయితే నన్ను సమంత గారి చెల్లెలు అని అనుకున్నారు.ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు, సమంత మీకు కజిన్ అవుతుందా అని.అంత పెద్ద సూపర్ స్టార్ తో పోల్చి నన్ను ఇలా చూడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది’ అని చెప్పుకొచ్చింది సంయుక్తా మీనన్.

ఇక పోతే సంయుక్త మీనన్ చేతిలో ప్రస్తుతం డెవిల్ అనే చిత్రం( Devil ) తప్ప మరొకటి లేదు.టాలీవుడ్ లోకి ఈమె అడుగుపెట్టక ముందే మలయాళం లో పెద్ద స్టార్ హీరోయిన్.అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.అయితే తెలుగు లో వరుస హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కి ఇలా సడన్ గా అవకాశాలు రాకపోవడం ఏమిటి అని అందరూ అనుకుంటున్నారు.
అయితే సంయుక్త మీనన్ ( amyuktha Menon )కి అవకాశాలు వస్తున్నాయి, కానీ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చెయ్యాలని ఒక నియమం పెట్టుకోవడం వల్లే చేతికి వచ్చిన ప్రతీ సినిమా చెయ్యకుండా జాగ్రత్త పడుతుంది అని అంటున్నారు ఫ్యాన్స్.