సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఏడాదిపాటు షూటింగ్ లకు దూరంగా ఉన్నారంటే ఆమెను ప్రేక్షకులు మరిచిపోతారు.అయితే స్టార్ హీరోయిన్ సమంత( Star Heroine Samantha ) ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉన్నా ఆర్మాక్స్ సర్వేలో ఆమె నంబర్ వన్ గా నిలిచి ఆశ్చర్యపరుస్తున్నారు.
మయోసైటిస్ సమస్య( Myositis ) వల్ల కొంతకాలం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన సామ్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు.సరైన సినిమాతో సమంత రీఎంట్రీ ఇచ్చి రీఎంట్రీలో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సమంత సొంతూరు చెన్నై( Chennai ) అనే సంగతి తెలిసిందే.చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో జరిగిన ఒక ఈవెంట్ లో సమంత పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ బ్యూటీ పంచుకున్నారు.“సొంతూరిలో దక్కే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే” అని చెబుతూ సామ్ ఈ ఫోటోలను షేర్ చేయడం గమనార్హం.
ఏ మాయ చేశావె సినిమా( Ye Maaya Chesave )తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సమంత అప్పటినుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉన్నారు.సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్( Citadel ) అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావాల్సి ఉండగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.సోషల్ మీడియాలో సమంత గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.
సమంత రీఎంట్రీలో కమర్షియల్ సినిమాలకు ఓటేస్తారో లేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు( Lady oriened Movies ) ప్రాధాన్యత ఇస్తారో తెలియాల్సి ఉంది.సమంత షేర్ చేసిన ఫోటోలకు 12 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.సమంత అభిమానులు సైతం “ఎంతమంది హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నా సమంత మాకు ఎప్పటికీ ప్రత్యేకమే” అని చెబుతున్నారు.వయస్సు పెరుగుతున్నా సమంత గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఏ మాయ చేశావె మూవీ రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.