'శాకుంతలం' సినిమా ప్రమోషన్ కోసం సమంత కేటాయించిన డేట్లు ఎన్ని రోజులు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వచ్చే నెలలో శాకుంతలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

గుణశేఖర్ స్వీయ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ను దిల్ రాజు సమర్పిస్తున్నాడు.

భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మరియు తెలుగు రాష్ట్రాల బయట సమంత శాకుంతలం సినిమా ను రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు, అతి త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా దర్శకుడు గుణశేఖర్ ప్రకటించాడు.నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయని గుణశేఖర్ పేర్కొన్నాడు.

ఇటీవల సమంత ఈ సినిమా కు డబ్బింగ్ చెప్పిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.ఈ సినిమా కు భారీ వీ ఎఫ్ ఎక్స్ వర్క్ చేయించారని సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమంత దాదాపుగా వారం రోజుల పాటు డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.యశోద సినిమా కు కేవలం ఒకే ఒక్క రోజు సమంత ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ సమయం లో

Advertisement

సమంత ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదు, కానీ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడింది.షూటింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.కనుక అతి త్వరలోనే విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలకు సమంత హాజరు అవ్వడం ఖాయం అన్నట్లుగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

సమంత తీవ్ర అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డ కారణంగా ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమా శాకుంతలం తో సక్సెస్ దక్కించుకుంటే మరింత ఆనందం అన్నట్లు సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.

సమంత త్వరలో ఖుషి సినిమా షూట్ లో కూడా పాల్గొనబోతుందట.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు