స్టార్ డైరెక్టర్ గుణశేఖర్( Director Gunasekhar ) దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం శాకుంతలం.( Shaakuntalam ) సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.దేవ్ మోహన్, మోహన్ బాబు, గౌతమి, అనన్య నాగళ్ళ.వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.ఏప్రిల్ 14 న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది.అయితే ఈ చిత్రం పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్లో ఏమో కానీ.
ఇటీవల ప్రీమియర్ షో వేసింది చిత్ర బృందం.అలాగే యుఎస్ లోను ( USA ) ప్రీమియర్స్ మొదలయ్యాయి .మరి సినిమా అక్కడి వారిని ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం…

సమంత( Samantha ) అనేక ఇబ్బందులు దాటుకుని, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది.సరిగ్గా `శాకుంతలం` చిత్రంలోనూ శకుంతల పాత్ర కూడా అలాంటి స్ట్రగుల్సే పడిందని అంటున్నారు సినిమాకి, సమంతకి మంచి కనెక్షన్ ఉందని చెబుతున్నారు .సినిమా ప్రధానంగా దుష్యంత్, శకుంతల మధ్య ప్రేమ కథ, ఎమోషన్స్, స్ట్రగుల్స్ ప్రధానంగా సాగిందని … వాటిని దర్శకుడు చక్కగా చూపించారని యుఎస్ ఆడియెన్స్ చెబుతున్నారు.శృంగార కోణం కాకుండా ఆమె పడే బాధలు, సంఘర్షణ వంటి భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు సినిమా చూసిన యుఎస్ ఆడియెన్స్ అంటున్నారు అయితే.

గుణశేఖర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టేకింగ్ విషయంలో శ్రద్ద పెట్టలేదు అని కొందరు అంటున్నారు.సినిమాలో లెక్కలేనన్ని పాత్రలు ఉన్నప్పటికీ.కొందరికే సరైన ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు .అయితే ఈ విషయాన్ని దర్శకుడే ముందే చెప్పారు .ఇక సినిమా ఓ భావోద్వేగాల సమాహారంగా ఉందని అంటున్నారు.సమంత అద్భుతంగా చేసిందని, ఆమె పడే బాధలను దర్శకుడు బాగా చూపించాడని అంటున్నారు.

సమంత, దేవ్ మోహన్ నటన బాగుందని .మైథలాజికల్ మూవీ కావడంతో సంగీత దర్శకుడు మణిశర్మ మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని అంటున్నారు.అల్లు అర్హ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, ఆమె చెప్పే తెలుగు డైలాగ్‌లు ముచ్చటగా ఉంటాయని యుఎస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు .అలాగే చాలా సీన్స్ రొటీన్‌గానే అనిపించాయని చెబుతున్నారు.మైథలాజికల్ మూవీ అయినా, రెగ్యూలర్ ఫ్యామిలీ డ్రామాల్లోని సీన్లని తలపించాయని అంటున్నారు.ఎంచుకున్న ఫ్లాట్ మాత్రం కొత్తది గానీ, సీన్లు మాత్రం రొటీన్‌గానే ఉన్నాయని చెబుతున్నారు.
విజువల్ వండర్, కళాఖండం అనేంత స్థాయి లేదని, వినోదానికి ఆస్కారం లేదంటున్నారు.అయితే సమంత నటన పరంగా వావ్ అనిపించిందని చెబుతున్నారు…
.








