సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.ప్రస్తుతం తన అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈమె సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు.తాజాగా సమంత ఒక కాలేజీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో సమంత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక విద్యార్థి సమంతను ప్రశ్నిస్తూ మీకు యాక్టింగ్ లో రోల్ మోడల్ ( Role Model ) ఎవరు అనే ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ.నాకు యాక్టింగ్ లో రోల్ మోడల్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అంటూ సమాధానం చెప్పారు.
తనతో కలిసి మరో సినిమాలో నటించాలని అనుకుంటున్నాను.ఎందుకంటే, తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అంటూ సమంత అల్లు అర్జున్ గురించి ఇలాంటి కామెంట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఇక సమంత అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటికే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప( Pushpa ) సినిమాలో సమంత ఊ అంటావా మావ.ఊఊ అంటావా మావ అనే స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేశారు.దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.ఇక సమంత కూడా అల్లు అర్జున్ తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.
మరి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.