Varun Tej Operation Valentine : వారందరికీ ఉచితంగా తన సినిమాని చూపించిన వరుణ్ తేజ్.. మంచి మనస్సు అంటూ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ).శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

 Varun Tej Operation Valentine Movie Special Screening For Orphan Students-TeluguStop.com

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్లో తెరికెక్కినటువంటి ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.

పెద్ద ఎత్తున విన్యాసాలతో కూడినటువంటి సన్నివేశాలలో వరుణ్ ఎంతో అద్భుతంగా నటించారు.

ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంతో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నటువంటి తరుణంలో వరుణ్ తేజ్ తీసుకున్నటువంటి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.తను నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాని ఏకంగా అనాధ పిల్లలకు( Orphan Children ) ఉచితంగా చూపించారు.హైదరాబాద్ గోకుల్ ధియేటర్లో( Gokul Theater ) ఏకంగా 200 మంది అనాధ విద్యార్థులకు ఉచితంగా ఈ సినిమాని చూపించారు.

ఇలా ఈ సినిమా చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

వాలెంటైన్ డేను బ్లాక్ డేగా( Black Day ) ఎందుకంటారో అర్ధమైందని.తమకూ ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనిపించేలా ఈ సినిమా తమలో స్ఫూర్తి నింపిందని విద్యార్ధినులు పేర్కొన్నారు.సాయి సేవా సంఘ్ విద్యార్ధినులకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

  ఇక ఈ విద్యార్థినులందరికీ కూడా ప్రయాణంతో పాటు సినిమా స్నాక్స్ అన్నింటినీ కూడా ఉచితంగానే అందించడంతో ఈ సాయి సేవ సంఘ నిర్వాహకులు వరుణ్ తేజ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఇక ఈ సినిమా పుల్వామా దాడి ఘటన ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఇందులో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube