Varun Tej Operation Valentine : వారందరికీ ఉచితంగా తన సినిమాని చూపించిన వరుణ్ తేజ్.. మంచి మనస్సు అంటూ?
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ).
శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్లో తెరికెక్కినటువంటి ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.
పెద్ద ఎత్తున విన్యాసాలతో కూడినటువంటి సన్నివేశాలలో వరుణ్ ఎంతో అద్భుతంగా నటించారు. """/" /
ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంతో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నటువంటి తరుణంలో వరుణ్ తేజ్ తీసుకున్నటువంటి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
తను నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాని ఏకంగా అనాధ పిల్లలకు( Orphan Children ) ఉచితంగా చూపించారు.
హైదరాబాద్ గోకుల్ ధియేటర్లో( Gokul Theater ) ఏకంగా 200 మంది అనాధ విద్యార్థులకు ఉచితంగా ఈ సినిమాని చూపించారు.
ఇలా ఈ సినిమా చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
"""/" /
వాలెంటైన్ డేను బ్లాక్ డేగా( Black Day ) ఎందుకంటారో అర్ధమైందని.
తమకూ ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనిపించేలా ఈ సినిమా తమలో స్ఫూర్తి నింపిందని విద్యార్ధినులు పేర్కొన్నారు.
సాయి సేవా సంఘ్ విద్యార్ధినులకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక ఈ విద్యార్థినులందరికీ కూడా ప్రయాణంతో పాటు సినిమా స్నాక్స్ అన్నింటినీ కూడా ఉచితంగానే అందించడంతో ఈ సాయి సేవ సంఘ నిర్వాహకులు వరుణ్ తేజ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక ఈ సినిమా పుల్వామా దాడి ఘటన ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఇందులో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ నటించారు.