సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.ఈమె ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించు కోకుండా దూసుకు పోతుంది.
ఇక సామ్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఎంత హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.
ఈమె నటించిన పాత్రకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.
బోల్డ్ సన్నివేశాల్లో మాత్రమే కాదు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించి సంచలనం క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు మరోసారి మరో సంచలన పాత్రలో నటించడానికి సమంత రెడీ అవుతుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే త్వరలోనే మరొక వెబ్ సిరీస్ ను తెరకెక్కించ బోతున్నారని తెలుస్తుంది.
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ అనే సిరీస్ ను భారతీయ భాషల్లో రీమేక్ చేయబోతున్నారట.
ఇందులో ప్రియాంక చోప్రా పాత్రలో సామ్ నటించ బోతున్నట్టు సమాచారం.మరి ఈ పాత్ర కోసం సమంత ప్రిపరేషన్ మాములుగా లేదు అని తెలుస్తుంది.ముంబైలో అడుగుపెట్టిన సామ్ అక్కడ హిందీ నేర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది.

అందుకే హిందీలో అనర్గళంగా మాసీ స్టైల్ లో అక్కడి యాస కూడా నేర్చుకోవడానికి స్పెషలిస్ట్ ను ట్యూటర్ గా పెట్టుకున్నట్టు సమాచారం.ఈమె జాగ్రత్తలు చుసిన వారంతా వామ్మోవ్ ఏమి పట్టుదల అని అనకుండా ఉండలేక పోతున్నారు.మరి సిటాడెల్ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతుంది.
అందుకే ఈ ప్రిపరేషన్స్ అని తెలుస్తుంది.ఇక తెలుగు సామ్ ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.