టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఇతర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే నాగార్జున ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి అలాగే బిగ్ బాస్ రియాలిటీ షో మూడవ సీజన్ నుంచి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమానికి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
తాజాగా ఈ కార్యక్రమం బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సీజన్ సిక్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందని నాగార్జున ఒక వీడియో ద్వారా వెల్లడించారు.ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని అందరూ భావించారు.
అయితే బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి నాగార్జున కాకుండా ఆయన మాజీ కోడలు సమంతను వ్యాఖ్యాతగా తీసుకోవాలని భావిస్తున్నారట.

సమంత ఇదివరకే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో ఒకరోజు నాగార్జునకు బదులుగా ఈమె యాంకర్ గా వ్యవహరించారు.ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమానికి సమంత అయితే బాగుంటుందని భావించిన నిర్వాహకులు నాగార్జునను తప్పించి సమంతను ఆయన స్థానంలో వ్యాఖ్యాతగా తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







