ఇండస్ట్రీలో క్రేజీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ( Samantha )నాగచైతన్య( Nagachaitanya ) జంట ఒకటి అని చెప్పాలి.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటిస్తూ ప్రేమలో పడ్డారు అయితే వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి ఇద్దరు కూడా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎందరితో ఆదర్శంగా నిలిచినటువంటి వీరిద్దరూ ఉన్నఫలంగా విడాకులు తీసుకొని విడిపోతూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి.ఇలా సమంత నాగచైతన్య విడిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ కూడా ఒకరికొకరు ఇచ్చుకున్నటువంటి కానుకలను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసారని తెలుస్తుంది అయితే సమంత నాగచైతన్యను ప్రేమించిన సమయంలో ఆమె నడుము పై భాగంలో చైతన్య పేరును టాటూ ( Tattoo )పేరును వేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే విడాకుల తర్వాత కూడా కొంతకాలం పాటు సమంత ఆ టాటూ అలాగే ఉంచారు.
అయితే సమంత నాగచైతన్యకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఏకంగా ఆ టాటూ కూడా తీసేయించుకున్నారని తెలుస్తుంది.

తాజాగా ఈమె పింక్ కలర్ చీరలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ సందడి చేశారు.ఇక ఈ చీరలో సమంత పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత నడుము పై భాగంలో చైతన్య పేరును టాటూగా వేయించుకున్నది కనిపించడం లేదు దీంతో సమంత నాగచైతన్యకు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్లు తన వద్ద ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ టాటూ కూడా తీసేయించుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
ఇలా నాగచైతన్య సమంత విడిపోవడంతో ఈమె కూడా టాటూ లను తొలగించుకోవడం వల్ల చైతన్య అంటే సమంతకు ఇంత పగ ఎందుకు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.అలాగే వీరిద్దరూ కలుసుకోబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలకు కూడా సమంత ఈ విధంగా చెక్ పెట్టిందని చెప్పాలి.







