సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సమంత( Samantha ) ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తరుణంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చారు.
అయితే త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత తన సినిమాలపై ఫోకస్ చేశారు.
ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఇక సమంత సినిమాలకు దూరమైనప్పటికీ ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.

ఇప్పటివరకు పలు సర్వేలలో మోస్ట్ పాపులర్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ గా మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నటువంటి సమంత తాజాగా ఐఎండీబీ( IMDB ) జాబితాలో కూడా చోటు సంపాదించుకున్నారు.ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో 13వ స్థానాన్ని సమంత సొంతం చేసుకున్నారు.దీనిపై తాజాగా సామ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ తాను 13వ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ ఘనత నా కష్టానికి దక్కిన ప్రతిఫలం అని తెలిపారు.నా సినీ కెరియర్ ఇప్పుడే మొదలు పెట్టినట్టు నాకు అనిపిస్తుంది.కానీ ఇన్నేళ్లు ఎలా ప్రయాణం చేశానో తెలియడం లేదని తెలిపారు.ప్రస్తుతం మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పని చేస్తానని సమంత చెప్పారు.ఐఎండీబీ జాబితాలో టాప్ 15లో ఉన్న ఏకైక సౌత్ స్టార్‌గా సమంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈ జాబితాలో దీపికా పడుకోణె( Deepika Padukone ) అగ్రస్థానంలో నిలిచారు.ఇక 16, 18 స్థానాలలో తమన్నా( Tamannah ) నయనతార( Nayanatara ) ఉండటం విశేషం.







