సమంత ఆరు నెలల్లో ఏం చేయబోతుంది.. ఆమె పోస్ట్‌ కు అర్థం ఏంటో?

నాగ చైతన్య తో విడాకులు ప్రకటించిన సమంత సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా అయింది.

గత కొన్నాళ్లుగా ఆమె రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ని ఇండైరెక్టు గా సందేశం ఇస్తూ షేర్ చేస్తూ వస్తోంది.

తనను తాను నిరూపించు కోవడం కోసం చాలా కష్టపడుతున్నట్లుగా, అందరికీ చెప్పకనే చెబుతోంది.గతంలో ఎప్పుడూ లేని విధంగా సమంత రెగ్యులర్గా జిమ్ వీడియోలు మరియు ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది.

తన ఫిజిక్ ని మరింత మెరుగ్గా చేసుకోవడం కోసం కష్టపడుతున్న ఆమె ఇదే సమయం లో కొన్ని సూక్తులు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తాను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను అని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.సమంత రెగ్యులర్గా చేస్తున్న పోస్టు లు ఆమె యొక్క మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

తాజాగా ఆమె తనకు తాను ఒక కొటేషన్ ఇచ్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.రాబోయే ఆరు నెలల్లో నువ్వు నన్ను ఒక అద్భుతమైన విజయం సాధించిన అమ్మాయిగా చూస్తావంటూ పేర్కొంది.

Advertisement

ఆర్నెలల్లో నీవు గర్వంగా ఫీలయ్యేలా నేను చేస్తానని కూడా సమంత షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం హీరోయిన్ గా సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.ముఖ్యంగా ఈమె నటించిన శాకుంతలం సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సినిమా లతో పాటు ఇంగ్లీష్ సినిమా లను కూడా చేస్తున్న విషయం తెలిసిందే నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఈమె వరుస సినిమాలు కమిట్ అయింది.

ఆ సినిమాల్లో ఈ ఏడాదిలో రెండు మూడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement
" autoplay>

తాజా వార్తలు