టాలీవుడ్ లో ఇప్పుడు రాజమౌళి ఇంకా ప్రముఖ దర్శకులు ఒక్కో సినిమాకు పదుల కోట్ల రూపాయలతో సెట్టింగ్స్ ను వేయిస్తున్నారు.కాని కొన్ని సంవత్సరాల క్రితం కోటి రూపాయలతో సెట్టింగ్ అంటే నోరు వెళ్లబెట్టే వారు.
అంత సెట్టింగ్ ఏంటీ బుద్ది ఉందా అంటూ అనే వారు.ఆ సమయంలోనే ఒక్కడు సినిమా కోసం ఛార్మినార్ సెట్టింగ్ ను ఏకంగా కోటి రూపాయలతో వేసిన ఘనత ఆయనకు దక్కింది.
అర్జున్ సినిమా కోసం మదుర మీనాక్షి టెంపుల్ ను మూడు కోట్ల రూపాయలతో వేయడం జరిగింది.ఇప్పటికే ఆయన ఎవరో గుర్తుకు వచ్చే ఉంటుంది.
ఔను ఆయనే గుణశేఖర్.గత పదేళ్ల కాలంలో ఈయన చేసిన సినిమా ఒకే ఒక్కటి అది రుద్రమదేవి.
రుద్రమదేవి విడుదల అయిన అయిదు సంవత్సరాల తర్వాత శాకుంతలం మొదలు పెట్టాడు.కరోనా ఇతర కారణాల వల్ల శాకుంతలం సినిమా ఇంకా విడుదల కాలేదు.
కొన్ని నెలల క్రితం శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు విడుదల తేదీని ప్రకటించడం లేదు.
నేడు గుణశేఖర్ పుట్టిన రోజు.
నేడు అయినా శాకుంతలం సినిమా విడుదల తేదీని గుణ శేఖర్ ప్రకటించాలని సామ్ అభిమానులు వేడుకుంటున్నారు.ఇప్పటి వరకు ఆయన అసలు ఎందుకు సినిమాను విడుదల చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాని ఆయన మాత్రం సమాధానం చెప్పడం లేదు.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎన్నాళ్లు చేస్తారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
అసలు ఈ ఏడాది సినిమా విడుదల అవుతుందా లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శాకుంతలం సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగస్వామిగా ఉన్నాడు.
ఆయన అయినా ఈ సినిమాను వెంటనే విడుదల చేసేందుకు గుణశేఖర్ ను ఒత్తిడి తీసుకు రావాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.







