దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సమంత పేరు నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంది.గత కొన్ని రోజుల వరకు ఈమె వ్యక్తిగత జీవితం గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.
ఈ క్రమంలోనే నెటిజన్లు సమంత విడాకుల విషయం పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు.ఇక సమంత వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి వంటి మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఈ మూడు సినిమాలలో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఇక యశోద, ఖుషి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.ఇక ఈ మూడింటిలో ఏ ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఈమె మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కబోతున్న 67 వ చిత్రానికి సమంతను తీసుకోవాలన్న ఉద్దేశంలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం చిత్రబృందం సమంతను సంప్రదించగా ఇందుకు సమంత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.కథ వినగానే సమంత విజయ్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇదే కనుక నిజమైతే సమంత విజయ్ కాంబినేషన్లో ఇది నాలుగవ సినిమా అవుతుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘కత్తి, తేరి, మెర్సల్’ వంటి సినిమాలలో నటించారు.
మరి తాజాగా ఈ జంట గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే వరకు ఎదురు చూడాలి.







