టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే.తెలుగులో సినిమాలు తగ్గించినా కూడా ఈమెకు టాలీవుడ్‌లో అభిమానుల సంఖ్య చాలా పెద్దదే అని చెప్పవచ్చు.
తాజాగా ఈమె ట్విట్టర్‌లో ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది.‘ప్రకటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా… ఆగలేక పోతున్నా’ అంటూ ట్వీట్ చేసింది.
సమంత చేసిన ట్వీట్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సమంత ఏ విషయాన్ని చెప్పాలని ఉబలాట పడుతోంది అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
ఈమె తాజాగా మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.ఆ విషయంలో ఈమె ఉత్సాహంగా ఉందా, లేక మరేదైన విషయంపై ఈమె త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయా అంటూ చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది.ఆ విషయం గురించి ఏమైనా సమంత చెప్పాలని ఉబలాట పడుతుందా అనేది చూడాలి.
అతి త్వరలోనే సమంత తన మనస్సులో అదుముకుని పట్టుకున్న మ్యాటర్‌ను రివీల్ చేసే అవకాశాలున్నాయి.