ప్రేమలో నమ్మకం ఉంది... కష్టాన్ని గౌరవంతో భరించింది... సమంత పోస్ట్ వైరల్!

ప్రస్తుతం నటి సమంత శాకుంతలం (Shakuntalam) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ముంబైలో సందడి చేస్తున్నారు.ఇలా చిత్ర బృందంతో కలిసి ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

 Samantha Described About Shakuntala Character In Movie Details, Guna Shekar,sama-TeluguStop.com

అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు ఈ క్రమంలోనే సమంత(Samantha) సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ విధంగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ శకుంతల(Shakuntala) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

శకుంతల ఆమెకు చాలా నమ్మకాలు ఉన్నాయి తన ప్రేమలో నిజాయితీ ఉంది… తన జీవితంలో తనకు ఎదురైన ఎన్నో కష్టాలను దయతో గౌరవంతో అనుభవించింది.తనను బాధపెట్టిన సంఘటనలను నమ్మకంతో ఎదుర్కొంది.ఆమె ఒక యువరాణి.అడవి.జంతువుల పాత్రలు నాలోని చిన్నపిల్లను గుర్తుచేసాయి.నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాలో శకుంతల పాత్రను చూసి ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె సమంత షేర్ చేసిన వీడియోలో శకుంతల పాత్ర గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాకి గుణశేఖర్ (Guna shekar)దర్శకత్వం వహించగా,నీలిమ గుణ (Neelima Guna)దిల్ రాజు(Dil raju) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇక ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్(Dev Mohan) ఎంతో అద్భుతంగా నటించారు.ఇక చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించడం కోసం అల్లు వారసురాలు అల్లు అర్హ(Allu Arha) ఈ సినిమాలో సందడి చేశారు.ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube