యశోద, శాకుంతలం సినిమాలకు ముప్పు.. సమంత దూకుడే సినిమాలను ముంచేస్తుందా?

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సమంత కెరీర్ పరంగా దూకుడును పెంచేసింది.

 Netizens Trolls On Samantha Bbehavior,samantha,naga Chaitanya,rumors, Trolls On Samantha,yashoda,shakunthalam,tollywood-TeluguStop.com

అంతే కాకుండా ఎప్పుడు లేని విధంగా విడాకుల తర్వాత మరింత రెచ్చిపోతూ సోషల్ మీడియాలో ఫోటో షూట్ లు చేస్తోంది.ఈ క్రమంలోనే ఆమె ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇవ్వడంతో అవి తెలుగు ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు.

నాగ చైతన్య నుండి విడి పోయిన తర్వాత ఆమె వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే చాలా మంది విమర్శలు చేయడం మనం చూస్తూ ఉన్నాం.అయితే ఇలాంటప్పుడు సమంత మరింతగా తెలుగు వారికి ఘాటు సమాధానాలు ఇస్తుండటంతో ఆ ప్రభావం ఆమె నటించిన సినిమాలపై పడే అవకాశం ఉంది అని అంటున్నారు.

 Netizens Trolls On Samantha Bbehavior,Samantha,Naga Chaitanya,Rumors, Trolls On Samantha,Yashoda,Shakunthalam,Tollywood-యశోద, శాకుంతలం సినిమాలకు ముప్పు.. సమంత దూకుడే సినిమాలను ముంచేస్తుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు ప్రేక్షకులకు సమంత పై ఇప్పటికే పీకలలోతు కోపం ఉండి ఉంటుంది.ఎందుకంటే చాలా ఇన్నోసెంట్ అయిన నాగ చైతన్య ను సమంత మోసం చేసి విడి పోయిందని అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఆమెను తెలుగు లో చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడే అదే వంద కోట్ల సినిమాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాను భారీ ఎత్తున గ్రాఫికల్‌ విజువల్ వండర్‌ గా చూపించేందుకు గాను దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు.

మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీ యశోద కూడా విడుదలకు సిద్దంగా ఉంది.ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా వంద కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంది.అంతకు మించి కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ రెండు సినిమాల నిర్మాతలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇప్పటికీ అయిన సమంత తన తీరును మార్చుకోకపోతే తప్పకుండా ఆమె నటించిన సినిమాల పై ప్రభావం పడుతుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube