Samantha Vijay Devarakonda: విజయ్ తో డేట్ కు వెళ్లి చిల్ అవుతున్న సమంత.. రష్మిక చూస్తే ఊరుకోదంటూ ట్రోల్స్?

ఈ మధ్య సమంత ( Samantha ) ప్రతి విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసింది.ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది.

 Samantha Chilling After Going On A Date With Vijay Devarakonda-TeluguStop.com

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో తను డీల్ చేస్తుంది.వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతుంది.

అవి ఫ్లాప్ అయినా కూడా వెనుకడుగు వేయకుండా మళ్ళీ అవకాశాలు అందుకుంటూనే ఉంది.రీసెంట్ గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

దీంతో సమంత ప్రస్తుతం తన ఆశలన్నీ ఖుషి సినిమాపై( Khusi Movie ) పెట్టుకుంది.ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక సమంత కెరీర్ అంతే అని చెప్పాలి.

విడాకులు తర్వాత సినిమాలపరంగా తనకు అంత సక్సెస్ రాలేకపోయాయి.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో( Vijay Devarakonda ) ఖుషి సినిమాలో నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.ఇక సమంత కూడా ఖాళీ సమయం దొరికితే విజయ్ దేవరకొండ తో చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నట్లు తెలిసింది.

మామూలుగా సమంత షూటింగ్ తనతో నటించిన హీరోలతో అంతగా మూవ్ అవ్వదు.కానీ విజయ్ దేవరకొండ తో షూటింగ్ లోనే కాకుండా బయట కూడా సమయాన్ని గడుపుతున్నట్టు.

తాజాగా తను ఇన్స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో తను, రెస్టారెంట్లో ఫుడ్ డేట్ కి వచ్చినట్లు కనిపించింది.

ఇక వారి ముందు ఫుడ్ ఐటమ్స్ ఉండగా.వారిద్దరు కెమెరాకు చిల్ అవుతూ కనిపించారు.

ఇక ఆ ఫోటో వైరల్ అవ్వగా చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

సమంత నేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.మరి కొంతమంది ఏదో తేడా కొడుతుంది అంటూ ఇక మరి కొంతమంది విజయ్ సమంత ను కూడా పడేశాడు కదా అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.ఇక సమంత పెట్టిన పోస్ట్ ను విజయ్ దేవరకొండ రీస్టోరీ పెట్టి.

ఫేవరెట్ గర్ల్ అంటూ దిల్ సింబల్ తో పంచుకున్నాడు.ఇక వీరిద్దరి మధ్యల లోలోపన ఏమైనా జరుగుతుందా అని మరి కొంతమంది అనుమానం పడుతున్నారు.

ఇక మరికొంతమంది సమంతను వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయమని.లేదంటే రష్మిక మందను( Rashmika Mandanna ) చూస్తే మిమ్మల్ని కొడుతుంది అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది విజయ్ దేవరకొండ ని ట్యాగ్ చేస్తూ చైతూ చూస్తే అసలు ఊరుకోడు అంటూ.గ్యాప్ మెయింటైన్ చేయు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక వారిద్దరూ అలా ఎందుకోసం కలుసుకున్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా ఇద్దరికీ ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా పైనే ఆశలు పెంచుకున్నాడు అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube