టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత తాజాగా శాకుంతలం ( Shaakuntalam ) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత పుట్టినరోజు( Samantha Birthday ) సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సమంత అభిమానులు ఆమెకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇదివరకు ఎప్పుడు సమంతకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వలేదు.సమంతా పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నప్పటి ఫోటోలో సమంత ను చూసి మురిసిపోతున్నారు.కాగా ఆ ఫోటోలో సమంత పింక్ కలర్ గౌన్ ని వేసుకొని అమాయకంగా చూస్తూ చూడడానికి ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది.మరొక ఫోటోలో సమంతను వాళ్ళ అమ్మ ఎత్తుకోగా ఆ ఫోటోలో కూడా క్యూట్ స్మైల్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అలాగే కాలేజీ డేస్ లో సమంత స్నేహితులతో కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటోలు కాలేజీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.







