Ponniyin Selvan 2 OTT : ఆ ఓటీటీ సంస్థను డిజిటల్ పార్టనర్ గా లాక్ చేసిన పొన్నియిన్ సెల్వన్ 2?

స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Star Director Maniratnam )దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ విడుదల అయినప్పటికీ అన్ని భాషల్లో మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకోగా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

 Ponniyin Selvan 2 Ott Rights Bagged By Amazon Prime-TeluguStop.com

ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా అనగా ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఈ సారి కూడా మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది.తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు.కాగా ఈ ఈ సినిమాలో విక్రమ్( Vikram ), జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ సెలెబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పార్ట్‌నర్‌( Digital partner )ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాను ఓటీటీ( Ponniyin Selvan 2 OTT )లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్( AR Rahman ) సంగీతం అందించిన విషయం తెలిసిందే.ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పోను పోను కలెక్షన్లను ఏ విధంగా రాబడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube