స్టార్ హీరోయిన్ సమంత( star heroine Samantha ) గురించి పుకార్లు ఎప్పుడు షికార్లు చేస్తూనే ఉంటాయి.ముఖ్యంగా నాగ చైతన్య నుండి విడాకులు( Divorce from Naga Chaitanya ) తీసుకున్న తర్వాత నాగ చైతన్య గురించి ఎంతగా అయితే పుకార్లు వస్తున్నాయో అదే స్థాయి లో వ్యక్తిగత జీవితం గురించి సమంత పై కూడా పుకార్లు వస్తున్నాయి.
కొన్ని పుకార్లు మరీ నమ్మశక్యంగా కూడా ఉండటం లేదు.హీరో మరియు హీరోయిన్ మధ్య ప్రేమ వ్యవహారం అనేది పుకార్లు పుట్టించడం చాలా కామన్ విషయం.
ఇప్పుడు మరోసారి అదే విషయం చర్చ జరుగుతోంది.వరుణ్ దావన్ మరియు సమంత ల ప్రేమ( Varun Dhawan and Samantha’s Love ) వ్యవహారం ఉంది అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు.

గత కొన్నాళ్లుగా వీరిద్దరు కలిసి సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్( Citadel is a Hindi web series ) కు వర్క్ చేస్తున్నారు.భారీ యాక్షన్ సిరీస్ కనుక కాస్త ఎక్కువ రోజులు డేట్లు కేటాయించాల్సి వచ్చింది.ఇద్దరు కూడా షూటింగ్ కోసం.ప్రమోషన్ కోసం విదేశాలు కూడా వెళ్తున్నారు.దాంతో హిందీ వెబ్ సిరీస్ లో సమంత ముఖ్య పాత్రలో నటిస్తూ హీరో వరుణ్ దావన్ తో ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి మరీ కొందరు ఈ ప్రచారం చేస్తున్నారు.

మొత్తానికి సమంత గురించి మరో పుకారు షికారు చేస్తున్న నేపథ్యం లో ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.సమంత ఈ మధ్య మరో వ్యక్తితో సన్నిహిత్యంగా మెలుగుతోందని.అతడితో ప్రేమలో ఉందేమో అంటూ పుకార్లు పుట్టుకు వచ్చాయి.మొత్తానికి సమంత గురించి రోజుకో వార్త అన్నట్లుగా ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టిస్తున్నారు.ముందు ముందు మరెన్ని పుకార్లు పుట్టుకు వస్తాయో చూడాలి.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఖుషి సినిమా లో నటిస్తూ హిందీ మరియు ఇంగ్లీష్ సినిమా ల్లో సమంత నటిస్తున్న విషయం తెల్సిందే.