ఒక్క భాషలో ఒక మంచి సినిమా వస్తే చాలు .ఆ భాషలోని హీరోతో పాటు ఇతర భాషల హీరోల కెరీర్ కుడా మారిపోతోంది .
మహేష్ బాబు పోకిరి సల్మాన్ ఖాన్, విజయ్ ల కెరీర్ దశను మారిస్తే .సల్మాన్ ఖాన్ దబాంగ్ పవన్ కళ్యాన్ కెరీర్ రూపురేఖలే మార్చేసింది.ఇప్పుడు మళ్ళి ఓ తమిళ సినిమా సల్మాన్ సిని జీవితంలో మైలురాయిగా నిలిచిపోతుందేమో .రామ్ చరణ్ రేంజ్ ని పెంచేస్తుందేమో !
రామ్ చరణ్ తమిళ సినిమా “తని ఒరువన్ ” ని రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే .ఇటివలే తమిళంలో విడుదలై, ఒక ఊపు ఊపుతోంది ఆ సినిమా … హీరో జయం రవి రేంజ్ ని ఆమాంతం పెంచేసింది ఈ సినిమా.
రామ్ చరణ్ తని ఒరువన్ రిమేక్ కు ఈ దసరా నాడే కొబ్బరికాయ కొడుతారని సమాచారం .అయితే ఈ సినిమాను హిందీలో రిమేక్ చేసేందుకు సల్మాన్ ఖాన్ సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మురుగదాస్-సల్మాన్ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుంది .కాని అది తని ఒరువన్ రిమేకా లేకా విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ చేస్తారా అనేది ఇప్పుడు తేలని విషయం.







