గుండెపోటుతో సల్మాన్ డూప్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన సల్మాన్ ఖాన్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలకు డూప్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.కొన్ని యాక్షన్స్ సన్ని వేశాలలోనూ హీరోలు నటించలేనటువంటి సన్నివేశాలలోనూ వారి డూప్ సహాయంతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

 Salman Khan Dupe Sagar Pandey Died Of Heart Attack Details, Salman Khan,sagar Pa-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఇలాగా డూప్స్ ఉండడం సర్వసాధారణం.ఇక బాలీవుడ్ కండల వీరుడు, బాలీవుడ్ బాయ్ జాన్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా డూప్ ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.

సాగర్ పాండే అనే వ్యక్తి అచ్చం సల్మాన్ ఖాన్ పోలికలతో ఉండి ఆయన డూప్ గా వ్యవహరిస్తున్నారు.

సాగర్ పాండే సల్మాన్ ఖాన్ తో కలిసి బజరంగీ భాయిజాన్’, ‘ట్యూబ్‌లైట్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’లాంటి సినిమాలలో నటించారు.

అయితే తాజాగా ఈయన గుండెపోటుతో మరణించడంతో సల్మాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ సాగర్ పాండే మృతి పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ సాగర్ పాండే ఫోటోని షేర్ చేస్తూ సంతాపం ప్రకటించారు.

ఇన్ని రోజులపాటు నాతో ఉన్నందుకు నా సోదరుడు సాగర్ పాండేకు హృదయపూర్వక ధన్యవాదాలు.

సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే సల్మాన్ ఖాన్ సాగర్ పాండే మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది కరోనా సమయంలో సినిమాలు లేకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడినటువంటి సాగర్ పాండేకు ప్రతినెల సల్మాన్ ఖాన్ డబ్బులు పంపించి తనని ఆదుకున్నారనీ గతంలో సాగర్ పాండే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సల్మాన్ ఖాన్ గురించి తెలియజేశారు.అయితే ప్రస్తుతం సాగర్ పాండే మరణించడంతో సల్మాన్ ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube