Salaar : సలార్1 లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా.. ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కు షాకివ్వనున్నారా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్( Salaar ).అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

 Salaar Movie Story Prabhas Or Prithviraj Sukumaran Hero In Movie Talk Goes Vira-TeluguStop.com

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే సలార్ సినిమా కోసం మా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

సలార్ రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుండగా అందులో పార్ట్ వన్ డిసెంబర్ 22 న విడుదల కానుంది.తాజాగా సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Telugu Bollywood, Prabhas, Salaar, Shruti Haasan, Tollywood-Movie

అయితే కొందరు ఈ మూవీ ట్రైలర్ ని చూసి సూపర్, బ్లాక్ బస్టర్ అంటుండగా ఇంకొందరు మాత్రం ఈ సినిమా ట్రైలర్ ఏమీ బాగోలేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ కథ చెప్పేశాడు.చిన్నప్పుడే ఇద్దరు మిత్రులు విడిపోతారు.ప్రభాస్, తన స్నేహితుడు పృథ్వీరాజ్ కి చిన్నప్పుడు ఒక మాట ఇచ్చి నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నేను ఉంటాను అని చెబుతాడు.

పెద్దయ్యాక పృథ్వీరాజ్ కి ఒక సమస్య వచ్చి ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.దీంతో ప్రభాస్‌ని సహాయం అడుగుతాడు.స్నేహితుడు కోసం ప్రభాస్ ఏం చేశాడు? ఇద్దరు స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనేదే కథగా ఉండబోతోంది.అయితే ఈ సినిమా రెండు పార్టులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Telugu Bollywood, Prabhas, Salaar, Shruti Haasan, Tollywood-Movie

సలార్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ కూడా చూపించలేదు.ఇక ట్రైలర్ 3 నిమిషాల 40 సెకండ్స్ ఉన్నా ట్రైలర్ ఆల్మోస్ట్ సగం అయ్యాక ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.ఇక సినిమా కథ చూస్తుంటే మొదట గంట పైగా చిన్నప్పుడు స్నేహితుల గురించి, పృథ్వీరాజ్ ( Prithviraj Sukumaran )గురించి, అతడి సంస్థానం, అతనికి సమస్య ఇలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా సినిమాలో కూడా ఎప్పుడో ఇంటర్వెల్ కి కానీ ప్రభాస్ రాడని, ప్రభాస్ వచ్చి ఒక మాస్ ఫైట్ సీక్వెన్స్ తర్వాత ఇంటర్వెల్ ఇస్తారని పలువురు అనుకుంటున్నారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే సలార్ పార్ట్ 1 సినిమాలో ప్రభాస్ ఎక్కువ సేపు ఉండడని, పార్ట్ 2లో మొత్తం ప్రభాస్ ఉంటాడని, పార్ట్ 1 అంతా పృథ్వీరాజ్ సుకుమారన్ ని చూపిస్తారని అనుకుంటున్నారు.

ట్రైలర్ కూడా చూస్తే అలాగే అనిపిస్తుంది.ఇది నిజమైతే కనుక ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తారు.ఇప్పటికే ఇలా జరగకూడదని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే మరి.ఇంకొందరు ఈ వార్తలపై స్పందిస్తూ కేవలం ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో ఎవరు హీరో మీరే చెప్పేస్తారా! కొంచెం ఓపిక పట్టండి డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube