ఆ డైరెక్టర్ లాగ దిగజారి మోసం చెయ్యలేను అంటూ ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్( Salaar ) రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంది.

కానీ ఇతర భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.ఎందుకంటే ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు.

వీళ్ళ కలయిక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ప్రతీ భాషలోనూ బంపర్ ఓపెనింగ్ ని ఆశిస్తారు ఆడియన్స్.కానీ అది జరగడం లేదు, హింది వెర్షన్ బుకింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి కానీ, అక్కడ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన డుంకీ చిత్రం( Dunki Movie ) ఉండడం తో సలార్ కి అదనంగా షోస్ కేటాయించడం లేదు.

Salaar Movie Director Prashanth Neel Shocking Comments On Lokesh Kanagaraj Cinem

ఇక తమిళం, కన్నడ వెర్షన్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వీళ్ళు #RRR చిత్రానికే టాక్ వస్తే కానీ కదలలేదు, ఇక్కడ సలార్ చిత్రానికి టికెట్స్ తెగాలంటే కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఒక ఎత్తు, మొన్న విడుదలైన రిలీజ్ ట్రైలర్ మరో ఎత్తు.

Advertisement
Salaar Movie Director Prashanth Neel Shocking Comments On Lokesh Kanagaraj Cinem

ట్రైలర్ ని చూసి నీరసించిన అభిమానుల్లో ఎక్కడలేని జోష్ ని నింపింది ఈ రిలీజ్ ట్రైలర్.ఈ ట్రైలర్( Salaar Trailer ) అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా బాగా ఉపయోగపడింది.

అంత బాగానే ఉంది కానీ, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూస్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) ఈ సినిమా గురించి మాట్లాడిన కొన్ని మాటలు మూవీ పై అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి.మొదటి నుండి ఈ సినిమాకి మరియు కేజీఎఫ్ చిత్రానికి లింక్ ఉంటుంది అనే రూమర్స్ ప్రచారం అయ్యేవి.

Salaar Movie Director Prashanth Neel Shocking Comments On Lokesh Kanagaraj Cinem

కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని, ఈ సినిమాకి కేజీఎఫ్ కి( KGF ) ఎలాంటి లింక్ లేదంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.ఈమధ్య కాలం లో తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) గారు తన ప్రతీ సినిమాకి ముందు సినిమాతో లింక్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని బలవంతంగా రుద్దేస్తున్నాడు.నా సినిమాలో అంత స్పేస్ లేదు, సినిమాకి హైప్ పెంచడం కోసం అలాంటి చీప్ ట్రిక్స్ వాడలేను అని డైరెక్ట్ గానే చెప్పేసాడు.

అంతే కాకుండా ఈ సినిమా స్టోరీ లైన్ నా గత చిత్రం ఉగ్రం తో పోలి ఉంటుంది.టేకింగ్ మాత్రం కేజీఎఫ్ స్టైల్ లో ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

సినిమా విడుదల సమయం లో ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా అని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు