లీకైన సలార్ మూవీ డైలాగ్.. ఈ డైలాగ్ ప్రభాస్ మూవీపై అంచనాలను పది రెట్లు పెంచుతోందంటూ?

ప్రభాస్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ( Salaar )పై విడుదల సమయం దగ్గర పడే కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి.సలార్ మూవీ ప్రీపోన్ కానుందని డిసెంబర్ నెల 20వ తేదీన సలార్ మూవీ బాక్సాఫీస్ బరిలో నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

 Salaar Movie Dialogue Leked Details Here Goes Viral In Social Media , Salaar M-TeluguStop.com

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సలార్ సినిమా నుంచి అప్ డేట్స్ రాగా ఆ అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.సలార్ సినిమాలో విలన్ రోల్ ను పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేస్తూ “యుద్దానికి నువ్వు నీ ఆయుధాల్ని తీసుకొచ్చుకో నేను ఇతన్ని తీసుకొస్తాను” అనే డైలాగ్ ను లీక్ చేశారు.

ఈ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ కు సంబంధించి వైరల్ అవుతున్న పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అని జరుగుతున్న ప్రచారంలో సైతం నిజం లేదని తెలుస్తోంది.ప్రభాస్( Prabhas ) ఈ సినిమాలో సైనికాధ్యక్షుడిగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్2( KGF 2 ) తర్వాత సినిమా కావడంతో ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.సలార్ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్ లో జరగనున్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.సలార్2 మూవీ షూట్ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube