సలార్ బ్లాస్టింగ్ అప్డేట్.. స్వాతంత్ర దినోత్సవం రోజు క్రేజీ అనౌన్స్ మెంట్!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఈ సినిమా హిట్ తర్వాత ఈయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.

 Salaar Massive Blasting Announcement , Salaar Teaser, Prabhas, Salaar, Prashanth Neel, Salaar Movie Update, Shruti Haasan, Pan India Movie-TeluguStop.com

దీంతో ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Salaar Massive Blasting Announcement , Salaar Teaser, Prabhas, Salaar, Prashanth Neel, Salaar Movie Update, Shruti Haasan, Pan India Movie-సలార్ బ్లాస్టింగ్ అప్డేట్.. స్వాతంత్ర దినోత్సవం రోజు క్రేజీ అనౌన్స్ మెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది.ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

రాధేశ్యామ్ ఇచ్చిన ప్లాప్ నుండి బయట పడాలంటే అంతకు మించిన డార్లింగ్ అప్డేట్ ఏదో ఒకటి ఉండాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండి ప్రశాంత్ నీల్ ను అప్డేట్ కోసం అడుగుతున్న విషయం తెలిసిందే.

మరి నీల్ ఇప్పటికి వీరి మోర విన్నట్టు అనిపిస్తుంది.

తాజాగా ఈ సినిమా నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి అప్డేట్ రావడంతో ఫుల్ సర్ప్రైజ్ అవుతున్నారు.

మేకర్స్ ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల 58 నిముషాలకు మాసివ్ అప్డేట్ అనౌన్స్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.

ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మేకర్స్ అప్డేట్ ఇస్తున్నట్టు ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అలెర్ట్ గా ఉన్నారు.

చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ లో మునుపటి ఉత్సాహం కనిపిస్తుంది.మరి ఈ అప్డేట్ ఏదైనా కూడా సెన్సేషన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

https://twitter.com/SalaarTheSaga/status/1558366747073294336?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1558366747073294336%7Ctwgr%5E0a406a97aa824f86e769384c21cc52d165e7d885%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-3924650861228868694.ampproject.net%2F2207281718002%2Fframe.html

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube